జంగమహేశ్వరపురంలో పోలీసుల తనిఖీలు

జంగమహేశ్వరపురంలో పోలీసుల తనిఖీలు

పల్నాడు: జిల్లా జంగమహేశ్వరపురంలో మంగళవారం పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మహేశ్వరరావు ఆధ్వర్యంలో ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. పత్రాల్లేని 23 బైక్‌లు, 4 ఆటోలు, కొన్ని ఆయుధాలను సీజ్ చేశారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఈ తనిఖీలు చేశారు. గ్రామాల్లో ఎవరైనా గొడవలకు దిగితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.