VIDEO: వీరేశ్వర స్వామి వారికి కార్తీకమాసం పూజలు
కోనసీమ: అంబాజీపేట మండలంలోని గంగలకుర్రు అగ్రహారం గ్రామంలో ఉన్న శ్రీ పార్వతీ వీరేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో కార్తీక మాసంలోని మొదటి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. పంచామృతాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.