సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో 500 రగ్గుల పంపిణీ.!
MDK: భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల వసతి గృహ విద్యార్థినీ విద్యార్థులకు 500 ఉలన్ రగ్గులను పంపిణీ చేశారు. జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు శిరిగి ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏబీసీడబ్ల్యూ గంగ కిషన్, సేవా సంస్థల బాధ్యులు ముక్క నగేష్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.