'లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి'
MDK: ఈనెల 15న జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు కోరారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ, ప్రతి పోలీస్ అధికారి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. మెదక్ పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులు, కోర్ట్ డ్యూటీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు