అక్కిరెడ్డిపాలెంలో.. యువతి ఆత్మహత్య

VSP: అక్కిరెడ్డిపాలెంలో ప్రవళిక అనే యువతి గురువారం ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక తల్లి, సోదరునితో కలిసి ఉంటోంది. వారిద్దరూ ఉద్యోగం నిమిత్తం బయటికి వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో ఉరివేసుకుంది. తల్లి వరలక్ష్మి ఫిర్యాదుతో గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.