బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి శిక్ష

బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి శిక్ష

HYD: మాదన్నపేటలో 17 ఏళ్ల మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి న్యాయస్థానం శిక్ష విధించింది. 2021 డిసెంబర్ 22న పోక్సో సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు భరత్ కుమార్ 2021లో ఇంటి అద్దె పేరు చెప్పి మైనర్‌ను వేధించాడు. బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు కోర్టులో తేలడంతో నిందితుడికి 3 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించారు.