VIDEO: పార్టీలో చేరిన రోజే సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం
MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో ఇటీవల పదవి విరమణ పొందిన వసతి గృహ సంక్షేమ అధికారిని మల్లెల భాగ్యమ్మ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్జ సారయ్య ఆమెకు హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కొత్తగూడ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఆమెను బలపరిచారు. ప్రతి ఒక్కరూ ఆమె గెలుపు కోసం కృషి చేయాలన్నారు.