నేడు పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం
AP: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏలూరు ఉంగుటూరు నియోజకవర్గం గోపీనాథపట్నంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అనంతరం పింఛను లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. నల్లమాడు ప్రజావేదికపై ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు.