'భారత ఆధునిక రూపశిల్పిగా నెహ్రూ నిలిచారు'
RR: షాద్‌నగర్ గ్రేడ్-1 గ్రంథాలయంలో గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రంథాలయ కమిటీ ఛైర్మన్ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం కోసం ఆయన చేసిన కృషి ప్రపంచానికి ఆదర్శమని, భారత ఆధునిక రూపశిల్పిగా నెహ్రూ నిలిచారని తెలిపారు.