ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
NTR: నందిగామ మండలం చందాపురంలో శ్రీరామనవమి రోజున ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన గ్రామస్థులు నందిగామ డీవీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ బాధితులను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అక్కడి వైద్య సిబ్బందికి సూచించారు.