అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

TPT: వెంకటగిరిలోని బంగారుపేట బీసీ కాలనీలో సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించిన నూతన అంగన్వాడీ భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థల సీఎస్‌ఆర్ నిధులు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు కీలకమని పేర్కొన్నారు.