పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
KMM: కార్తీకమాసం సందర్భంగా RTC ఆధ్వర్యంలో అన్నవరం, పంచారామాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు సత్తుపల్లి DM సునీత తెలిపారు. అన్నవరం పెద్దలకు రూ.570, పిల్లలకు రూ.330, పంచారామాల పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.770గా ఛార్జీలు నిర్ణయించామన్నారు. వివరాలకు 9866619189 సంప్రదించాలన్నారు.