మరణించి.. సజీవంగా నిలిచి
SKLM: లావేరు(M) పెద లింగాలవలసకు చెందిన శంభాన గణేష్(23) రోడ్డు ప్రమాదంలో గాయపడి, గురువారం కిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందాడు. డాక్టర్లు అవగాహన కల్పించగా తల్లిదండ్రులు గొప్ప మనసుతో ముందుకు వచ్చారు. వారు గణేష్ కిడ్నీ, గుండె, కాలేయం, ఊపిరితిత్తులను దానం చేశారు. తమ బిడ్డ మరణించినా వేరొకరికి ప్రాణం పోస్తుండడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.