చీరాలలో మెగా జాబ్ మేళా విజయవంతం
BPT: చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆధ్వర్యంలో చీరాల సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 14 కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగులు 375 మంది హాజరుకాగా వారిలో 137 మంది ఎంపిక అయ్యారని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారిణి మాధవి తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.