చింతలపూడిలో ఎక్సైజ్ అధికారుల దాడులు
ELR: చింతలపూడి మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న నాగేశ్వరరావును అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, బైండోవర్ విధించినట్లు ఎక్సైజ్ సీఐ పి. అశోక్ తెలిపారు. అదేవిధంగా బొర్రా నాగమణి, తాళ్లూరి వెంకటేష్ అనే మరో ఇద్దరిని బైండోవర్ చేశారు.