గంజాయి సాగు చేస్తున్న దంపతులు అరెస్ట్
NGKL: పదర మండలం వంకేశ్వరం శివారులో గంజాయి సాగు చేస్తున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. నేనావత్ సెల్లి, తిరుపతయ్య తమ వ్యవసాయ పొలంలో గంజాయి పెంచుతున్నట్లు సమాచారం అందడంతో అబ్కారీ సీఐ కృష్ణ సిబ్బందితో దాడి చేశారు. అక్కడ సాగు చేస్తున్న 16 గంజాయి మొక్కలతో పాటు 1.8 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు.