రాళ్లగూడెంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
ASF: దహేగాం మండలం బోర్లకుంట గ్రామపంచాయతీ పరిధి రాళ్లగూడెంలో క్రికెట్ టోర్నమెంట్‌ను గ్రామ సర్పంచ్ స్రవంతి - సుధాకర్ సోమవారం ఘనంగా ప్రారంభించారు. గ్రామ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ.. క్రీడల ద్వారా యువత ఆరోగ్యంగా ఉండాలని, ఐక్యత పెరగాలని వారు ఆకాంక్షించారు.