నాగార్జునసాగర్‌కు భారీగా వరద

నాగార్జునసాగర్‌కు భారీగా వరద

TG: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌కు భారీగా వరద ప్రవాహం పెరిగింది. మొత్తం 26 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్‌వే ద్వారా 2.51 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 3.05 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 2.93 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 585 అడుగులకు చేరుకుంది.