డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి

డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి

NLG: చండూరు పట్టణంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులపై దాడి జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురువారం రాత్రి కస్తాల రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్ ముందు మద్యం సేవిస్తున్న యువతను అక్కడి నుంచి వెళ్లాలని పోలీసులు చెప్పారు. దీంతో ఆగ్రహించిన యువకులు పోలీసులపై దాడికి పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.