VIDEO: రేపటి నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు

VIDEO: రేపటి నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు

CTR: పుంగనూరు పట్టణం హనుమంతరాయిదిన్నెలో రేపటి నుంచి శ్రీ వీరాంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే నిర్వాహకులు ఆలయాన్ని ముస్తాబు చేశారు. మంగళవారం అర్చకులు, భక్తులు ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. బుధవారం సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమవుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.