ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు వ్యక్తులు పాగా

VZM: కొత్తవలస కే. కోటపాడు వెళ్లే రోడ్డు పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆనుకొని కొత్తగా రెండు దుకాణాల ఏర్పాటుకు పునాదులు తవ్వారు. ముందురోజు అక్కడ చదును చేయడంతో స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. భవన నిర్మాణానికి సంబంధించి విజయనగరం జిల్లా పరిషత్ పరిపాలన అధికారిని చరవాణిలో సంప్రదించగా కొత్త భవన నిర్మాణాలకు ఎటువంటి అనుమతులు మంజూరు చేయలేదని తేల్చి చెప్పారు.