చెన్నకేశవ స్వామి ఆలయంలో దొంగతనం
JGL: ఎండపల్లి మండలంలో దొంగలు ఆలయాలనే టార్గెట్‌గా పెట్టుకున్నారు. గోడిసెలపేట చెన్నకేశవస్వామి ఆలయంలో హుండీతోపాటు సీసీ కెమెరా దొంగతనం, రాజారాంపల్లిలో రేణుక ఎల్లమ్మ ఆలయంలో హుండీ అపహరించారు. గతనెల ముంజంపల్లిలో కూడా రెండు ఆలయాల్లో చోరీలు జరగడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.