బొబ్బిలిలో పర్యటించిన ఉదయగిరి ఎమ్మెల్యే

బొబ్బిలిలో పర్యటించిన ఉదయగిరి ఎమ్మెల్యే

NLR: ఉదయగిరి MLA కాకర్ల సురేష్ ఆదివారం బొబ్బిలి కోటను సందర్శించారు. ఈ సందర్భంగా బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన ఆయనకు స్వాగతం పలికారు. కోటలోని దర్బార్ మహల్‌లో, అలనాటి బొబ్బిలి యుద్ధంలో ఉపయోగించిన ఆయుధాల చరిత్ర, వాటి ప్రత్యేకతలను ప్రతినిధులు వివరించారు. అలాగే రాజవంశానికి చెందిన కార్లు, రాజుల చిత్రపటాలు, కోటలోని వివిధ ప్రదేశాలను వీక్షించారు.