నగరిలో క్షయ నివారణపై అవగాహన
CTR: ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా నగరి ప్రాంతీయ వైద్యశాలలో అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రభావతి మాట్లాడుతూ.. క్షయవ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని భరోసా ఇచ్చారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు.