నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్

HYD: మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. టోలీచౌకి ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా యూనివర్సిటీ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నలుగురు నిందితులు మాజిద్ హుస్సేన్, నాసిర్ ఖాన్, బాసిర్ రెహమాన్, రెహ్మాన్ సిద్ధిఖీని అదుపులోకి తీసుకున్నారు.