బాలవనం పార్క్ పనుల పరిశీలన

బాలవనం పార్క్ పనుల పరిశీలన

బాపట్ల: ప్యాడిసన్‌పేటలో నిర్మాణంలో ఉన్న బాలవనం పార్క్‌ను కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. పిల్లల కోసం పార్క్‌ను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. ఆట పరికరాలు, గోడలపై సంస్కృతి ఉట్టిపడే చిత్రాలు వేయాలని సూచించారు. పెద్దలకు వాకింగ్ ట్రాక్, పూల మొక్కలు ఏర్పాటు చేయాలన్నారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.