స్కోచ్ అవార్డు సాధనపై కలెక్టర్‌కు సీఎం ప్రశంసలు

స్కోచ్ అవార్డు సాధనపై కలెక్టర్‌కు సీఎం ప్రశంసలు

కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ విధానానికి జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన, పారదర్శక మధ్యాహ్న భోజనం అందించడంలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తోందని కలెక్టర్ తెలిపారు.