రోడ్డు భద్రత అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ
కర్నూలు: రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. బుధవారం కిమ్స్ హాస్పిటల్స్, కర్నూలు న్యూరోసర్జరీ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ న్యూరోసర్జన్‌ల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన ర్యాలీని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు.