రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: కుప్పం స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సాయిమాత సేవా ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ, బెంగళూరుకు చెందిన శంకర కంటి అస్పత్రి వైద్యులు రోగులకు కంటి వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.