ఇంటర్ ఫలితాల్లో విద్యార్థిని సత్తా

ఇంటర్ ఫలితాల్లో విద్యార్థిని సత్తా

BPT: చీరాలలోని ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాల విద్యార్థిని నక్కల పద్మస్థిత ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. మార్కులు స్కోర్ చేయడానికి తక్కువ అవకాశం ఉండే సీఈసీలో విద్యార్థిని 930 మార్కులు సాధించింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో పద్మస్థిత కాలేజీ ఫస్ట్‌గా వచ్చిందని ప్రిన్సిపాల్ తెలిపారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా తమ ఫలితాలు ఉన్నాయని వెల్లడించారు.