5 మిలియన్ బ్యారెళ్ల చమురు కొన్న రిలయన్స్
ఇరాన్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ 50 లక్షల బ్యారెళ్ల (5 మిలియన్ బ్యారెళ్లు) ముడి చమురును కొనుగోలు చేసింది. 2019లో అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న రిలయన్స్, NIOCతో ఈ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.