'నిర్ణయిత గడువులోగా నివేదిక సమర్పించాలి'
WNP: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిబంధనల ప్రకారం నిర్వహించాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం పెబ్బేరు మండలం శాఖాపురం క్లస్టర్లను సందర్శించి నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిర్ణీత గడువు లాగా ఉన్నతాధికారులు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.