చెత్త సంపద తయారీ కేంద్రం తనిఖీ

SKLM: కంచిలి మండలం కేంద్రంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని మండల విస్తరణాధికారి కె.ఈశ్వరి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వర్మీ కంపోస్టు అమ్మకాలు చేపట్టాలని, సేంద్రీయ ఎరువులపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం షెడ్ నిర్వహణ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పాల్గొన్నారు.