ఇరాన్‌కు రోజుకు రూ.1,319 కోట్ల ఆదాయం

ఇరాన్‌కు రోజుకు రూ.1,319 కోట్ల ఆదాయం

ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఇరాన్‌కు వరంగా మారింది. హర్మూజ్ జలసంధిపై పట్టు సాధించిన ఆ దేశం ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ ద్వారా రోజుకు రూ.1,319 కోట్ల ఆదాయాన్ని గడిస్తోంది. ఇతర గల్ఫ్ దేశాలు రవాణా చేయలేక సతమతమవుతుంటే ఇరాన్ మాత్రం రోజుకు 16 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తూ లాభపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం వల్ల ఆ దేశానికి కలిసొస్తోంది.