అక్టోబర్ 15 నుంచి కేయూ బీటెక్ పరీక్షలు
WGL: కేయూ పరిధిలోని అన్ని బ్రాంచీల ఇంజినీరింగ్ మొదటి సెమిస్టర్ పరీక్షలను అక్టోబరు 15 నుంచి నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారులు ప్రకటించారు. అక్టోబర్ 15, 18, 21, 23, 27, 30, నవంబర్ 3న ఉదయం 10 నుంచి మ. ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఇతర వివరాల కోసం కేయూ వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు.