అచ్చంపేటలోని 13 వ వార్డులో పారిశుద్ధ్య పనులు

NGKL: అచ్చంపేట పట్టణంలోని 13వ వార్డులో పిచ్చి మొక్కలు పెరిగి పారిశుద్ధ్యం లోపించిందని ప్రజలు మున్సిపల్ ఛైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు దృష్టికి తీసుకువెళ్లారు. మున్సిపల్ ఛైర్మన్ వెంటనే స్పందించి బుధవారం వార్డులోని పిచ్చి మొక్కలను తీయించారు. ఛైర్మన్ స్పందనతో సమస్య తీరిందని వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.