'ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చండి'

NDL: కోయిలకుంట్ల పట్టణంలో వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని దొంగ హామిలు ఇచ్చి అధికారంలోకి రాగానే సరిపోదు అని మాజీ ఎమ్మెల్యే అన్నారు.