వైసీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గా రమేష్
కోనసీమ: వైసీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా రాజోలు మండలం తాటిపాకకు చెందిన బొంతు రమేష్ నియమితులయ్యారు. తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయని ఆయన సోమవారం తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రమేష్ కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.