మాడుగుల మండలంలో ఆధార్ క్యాంపులు

ASR: మాడుగుల మండలంలో ఈ నెల 19 నుంచి 30 వరకు రెండు విడుతలుగా ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఎండీవో కే అప్పారావు ఇవాళ తెలిపారు. తొలి విడత 19 నుంచి 23 వరకు, రెండో విడత 28 నుంచి 30 వరకు జరుగుతాయి. అవరువాడ, కింతలి, జేడీపేట, ఒమ్మలి, కేజేపురం, ముకుందపురం, వీరవెల్లి, పోతనపూడి గ్రామాలలో ఈ శిబిరాలు ఏర్పాటు చేయబడతాయి. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.