VIDEO: టెక్కలిలో ఉద్రిక్తత వాతావరణం
SKLM: టెక్కలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి అచ్చెనాయుడుపై వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఇన్‌చార్జ్ పేరాడ తిలక్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయగా, ఆయన స్వయంగా స్టేషన్‌కు హాజరయ్యారు. ఉదయం నుంచి తిలక్‌ను పోలీస్ స్టేషన్‌లోనే ఉంచారని ఆరోపిస్తూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కార్యకర్తలు ఒక్కసారిగా స్టేషన్ వైపు దూసుకెళ్లారు.