కష్టాల్లో CSK.. 30 పరుగులకే 3 వికెట్లు

కష్టాల్లో CSK.. 30 పరుగులకే 3 వికెట్లు

251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన CSK జట్టుకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. జాకబ్ డఫీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే కెప్టెన్ రుతురాజ్(7) పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్.. మాత్రే (1)ను ఔట్ చేశాడు. అనంతరం సంజూను కూడా ఔట్ చేసి డఫీ CSKని కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో చెన్నై 2.5 ఓవర్లలోనే 30 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.