విషాదం.. పంట పొలంలో రైతు మృతి

KMM: కూసుమంచి మండలం పాలేరుకు చెందిన రైతు ఎడవల్లి వీరభద్రారెడ్డి (50) తన పంటపొలంలో మృతి చెందాడు. పొలం గట్టు పక్కన కిందపడి ఉన్న వీరభద్రారెడ్డిని గమనించిన పక్క పొలాల రైతులు దగ్గరకు వెళ్లి చూడగా, అప్పటికే ఆయన చనిపోయినట్లు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.