యువకుడి దారుణ హత్య
MDK: తూప్రాన్ పట్టణ పరిధి అల్లాపూర్ శివారులోని లింగారెడ్డిపేట బస్టాప్ వద్ద గుర్తు తెలియని 35 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్య చేశారు. బస్ స్టాప్ వద్ద తాళ్లతో కట్టేసి కర్రలతో కొట్టి చంపినట్లుగా అనుమానిస్తున్నారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగగా పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు.