పాన్ షాపులపై ఆకస్మిక దాడులు

పాన్ షాపులపై ఆకస్మిక దాడులు

BDK: 'చైతన్యం-డ్రగ్స్‌పై యుద్ధం' కార్యక్రమంలో భాగంగా నిషేధిత మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారా లేదా అని ఎస్సై యయాతిరాజు తనిఖీ చేశారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు అశ్వారావుపేట పోలీసులు పట్టణంలోని పాన్ షాప్‌లపై ఆకస్మిక దాడులు ఇవాళ చేశారు. ఇటువంటి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.