పెన్నా నదిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరులోని పెన్నా నదిలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన బైకు, చెప్పులను బ్యారేజీపై వదిలి నదిలోకి దూకినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, మృతదేహం ఇంకా లభ్యం కాలేదన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.