అధిక ధరలకు విక్రయిస్తే సమాచారం ఇవ్వాలి: MPDO
ASF:కెరమెరి మండలం సావర్కేడ గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను MPO అంజాత్ తో కలిసి MPDO సురేష్ శనివారం పరిశీలించారు. ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణం కోసం వాడే సిమెంటు, కంకర, వంటి ముడి సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. ఇసుక ఉచితంగా అందిస్తున్నామని, లబ్ధిదారులు MRO ను సంప్రదించి అనుమతి పొందాలన్నారు