'మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుందాం'

KNR: ఈనెల 17న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుందామని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రం మహేశ్ కార్యకర్తలకు గురువారం పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే బలమైన నాయకుడు మోదీ అని కొనియాడారు. ఆయన జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు ప్రతిభ పోటీలు నిర్వహించాలని సూచించారు.