'అనారోగ్యం అని చెప్పినా వినకుండా వేధిస్తున్నారు'
ఎన్టీఆర్: అనారోగ్యం ఉందని చెప్పినా వినకుండా అదనపు విధులు అప్పగిస్తూ ఇబ్బంది పెడుతున్నారని మహిళా పోలీసు ఆందోళన చేశారు. పెనుగంచిప్రోలు మండలం వెంకటాపురం స్వర్ణ సచివాలయంలో తేజశ్రీ విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయ కార్యదర్శి అదనంగా విధులు అప్పగిస్తున్నారని, సెలవు అడిగినా ఇవ్వకుండా, అనారోగ్యం ఉందని చెప్పినా వినకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.