'క్యాన్సర్ పరీక్షల క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోండి'

'క్యాన్సర్ పరీక్షల క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోండి'

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ వద్ద గురువారం ఉచిత క్యాన్సర్ పరీక్షల శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. వైద్యులు మహిళలు, పురుషులకు వివిధ రకాల క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కనిగిరి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు, మహిళలు యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.