బంగారుపాళ్యంలో అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలు
CTR: బస్టాండ్ పరిధిలో మోటార్ సైకిళ్లు, ఆటోలు అక్రమంగా పార్కింగ్ చేయడంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ నేపథ్యంలో డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి, నిర్దేశించిన ప్రదేశాల్లోనే వాహనాలు పార్క్ చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.